మేం చేసిన తప్పేంటి?
ఎన్నికల ప్రచారంలో మా వలంటీర్ల వ్యవస్థను ఆకాశానికెత్తిన పెద్దమనిషి గెలిచిన తర్వాత తొలగించి రోడ్డున పడేశారు. ఈ వ్యవస్థలో లోపాలేంటో ప్రభుత్వ పెద్దలు చెప్పాలి. ప్రజాధనం మాకోసం ఖర్చు చేసినా అది ప్రజలకు ఉపయోగపడే సేవలకే ఖర్చయింది. కానీ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పేరుతో పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం సబబు కాదు. చాలా మంది వలంటీర్లు ప్రస్తుత ప్రభుత్వ హామీలను నమ్మి ఓట్లు వేసి మోసపోయారు. – మెట్ట మాధురి, మాజీ వలంటీర్
సూపర్‌సిక్స్ పేరుతో హామీలు ఇచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు ఆ తర్వాత వాటిని అమలు చేయడానికి డబ్బులు లేవని అంటున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు కాక లక్షలాది మంది విద్యార్థులు ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలతో ఇబ్బందులు పడుతున్నారు. మరి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రజలంతా గమనిస్తున్నారు.
– కొయ్య రామకృష్ణ, మాజీ వలంటీర్, మూలకుద్దు, భీమిలి మండలం


