ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్టీల్‌ప్లాంట్ సీఎండీ ఎం.ఎన్.వి.ఎస్. ప్రభాకర్ సూచించారు. ఈడీ (వర్క్స్) కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం నిర్వహించిన సెంట్రల్ సేఫ్టీ కమిటీ (సీఎస్‌సీ) సమావేశంలో విభాగాధిపతులు, ఉన్నతాధికారులు, సెంట్రల్ సేఫ్టీ కమిటీ ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. భద్రతా పర్యవేక్షణ ప్రతీ సీఎస్‌సీ సభ్యుని బాధ్యత అన్నారు. గతంలో బొకారో స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన అనుభవాలను వివరిస్తూ, అటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. సీఎండీ మొదటిసారి సెంట్రల్ సేఫ్టీ కమిటీ సమావేశానికి హాజరు కావడంతో ఉన్నతాధికారులు ఆశ్చర్యపోయారు. కార్యక్రమంలో డైరెక్టర్ (ఆపరేషన్స్) సుభాషిస్ సేన్ గుప్తా, సీజీఎం (వర్క్స్) పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికై న గుర్తింపు యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షుడు చీకటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి డి.దేముడు తదితరులను సమావేశంలో పరిచయం చేశారు.


