టీడీపీ పాగాకు బ్రేక్‌! | - | Sakshi
Sakshi News home page

టీడీపీ పాగాకు బ్రేక్‌!

Sep 30 2026 1:58 AM | Updated on Sep 30 2026 1:58 AM

చంద్రంపాలెం స్కూల్లో

రాజకీయ జోక్యానికి యత్నం

నిబంధనలు ఉల్లంఘించి

పాఠశాలలో ప్రవేశం

సభ్యులను బయటకు తీసుకెళ్లి చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నిక అడ్డుకునే యత్నం

ఎస్‌ఎంసీ ఎన్నికల్లో

మధురవాడ: రాష్ట్రంలోనే అత్యధిక విద్యార్థులున్న ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటైన చంద్రంపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఎస్‌ఎంసీ ఎన్నికల్లో రాజకీయ జోక్యం చర్చనీయాంశంగా మారింది. ఎస్‌ఎంసీలో తమకు అనుకూల వ్యక్తిని చైర్మన్‌గా కూర్చోబెట్టేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించినట్లు ఆరోపణలు వినిపించాయి. సుమారు 2,900 మంది విద్యార్థులు చదువుతున్న ఈ పాఠశాలలో ఎస్‌ఎంసీకి 19 మంది సభ్యులు ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగానే పలువురు టీడీపీ వార్డు అధ్యక్షులు, ఇతర నాయకులు నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల ప్రాంగణంలోకి ప్రవేశించి తల్లిదండ్రులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.

రద్దు/వాయిదాకు ఒత్తిళ్లు

ఇంత చేసినా.. ఆశించినంతగా తమ అనుకూల అభ్యర్థులు గెలుపొందకపోవడంతో ఎన్నికల రద్దు, లేదా వాయిదా వేయాలని అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. ఈ మేరకు అధికారులకు లేఖలు కూడా ఇచ్చినట్లు సమాచారం. చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నికల సమయంలోనూ ఇదే తరహా ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. తమకు అనుకూలంగా ఉన్న కొందరు కమిటీ సభ్యులను బయటకు తీసుకెళ్లి ఎన్నికకు అవసరమైన కోరం లేకుండా చేయాలని ప్రయత్నించినట్లు ఆరోపణలు వినిపించాయి. ఈ వ్యవహారంలో పాఠశాల హెచ్‌ఎం వెంకటరావు, ఎంఈవో రవీంద్రబాబుపైనా వివిధ మార్గాల్లో ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. అయితే ఎన్నికకు అవసరమైన కోరం ఉండటంతో ఎన్నికల అధికారి ప్రక్రియను కొనసాగించారు. దీంతో చైర్మన్‌ పదవిపై ఆశలు పెట్టుకున్న టీడీపీ వర్గాలు వైస్‌చైర్మన్‌ పదవితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిందని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.

‘మా కార్యకర్తే’అంటూ..

చైర్మన్‌గా ఎన్నికై న మంత్రాపు హనూక్‌బాబు(మహేష్‌) తమ కార్యకర్తేనని చెప్పుకునే స్థాయికి టీడీపీ వర్గాలు దిగజారాయంటూ స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ఎస్‌ఎంసీ ఎన్నికలను రాజకీయాలకు అతీతంగా నిర్వహించాల్సి ఉండగా, మరోవైపు తమకు అనుకూలంగా ఫలితాలను మలచుకునేందుకు రాజకీయ నేతలు జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. విద్యార్థుల విద్యా ప్రయోజనాలు, పాఠశాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాల్సిన ఎస్‌ఎంసీ ఎన్నికల్లో రాజకీయ ఆధిపత్యం కోసం ప్రయత్నాలు జరిగాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి చివరికి ఎస్‌ఎంసీ చైర్మన్‌గా మంత్రాపు హనూక్‌బాబు, వైస్‌చైర్మన్‌గా పిళ్లా స్వప్నతోపాటు 19 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటైంది. కార్యక్రమాన్ని డిప్యూటీ డీఈవో సోమేశ్వరరావు పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement