రేషన్‌ బియ్యానికి కొరత | - | Sakshi
Sakshi News home page

రేషన్‌ బియ్యానికి కొరత

Sep 30 2026 1:58 AM | Updated on Sep 30 2026 1:58 AM

మహారాణిపేట: జిల్లాలో పేదలకు పంపిణీ చేసే పీడీఎస్‌ బియ్యం కొరత ఏర్పడింది. అక్టోబర్‌ నెలకు అవసరమైన స్థాయిలో బియ్యం కేటాయింపులు జరగకపోవడంతో రేషన్‌ పంపిణీ అరకొరగా సాగే పరిస్థితి నెలకొంది. జిల్లాలో 5,12,619 తెల్ల రేషన్‌ కార్డులు, 625 చౌకధరల దుకాణాలు ఉన్నాయి. కార్డుదారులకు నెలకు 8 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరం కాగా, ప్రస్తుతం 5,500 మెట్రిక్‌ టన్నులు మాత్రమే గోదాములకు చేరాయి. ఇంకా 2,500 మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరం ఉంది. ఈ నెల 25 నాటికి డిపోలకు సరఫరా పూర్తి కావాల్సి ఉండగా, 29వ తేదీ నాటికి కూడా పూర్తి స్థాయిలో నిల్వలు చేరలేదు. ఇప్పటికే వచ్చిన బియ్యంలో సగం వరకు పంపిణీ చేయడంతో అక్టోబర్‌ మొదటి వారంలోనే నిల్వలు పూర్తయ్యే అవకాశం ఉందని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బియ్యం ధరలకు రెక్కలు

మరోవైపు బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గత మూడు నెలలుగా ధరలు పెరుగుతుండటంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాత బియ్యం డిమాండ్‌ను ఆసరాగా చేసుకొని వ్యాపారులు ధరలు పెంచుతున్నారని వినియోగదారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement