రాజకీయ పార్టీలు సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

రాజకీయ పార్టీలు సహకరించాలి

Sep 29 2026 1:33 AM | Updated on Sep 29 2026 1:33 AM

డాబాగార్డెన్స్‌: జీవీఎంసీ పరిధిలో త్వరలో నిర్వహించనున్న రెండో సాధారణ ఎన్నికలు–2026ను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జీవీఎంసీ కమిషనర్‌, అదనపు ఎన్నికల అథారిటీ కేతన్‌ గార్గ్‌ కోరారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం అదనపు కమిషనర్‌ డీవీ రమణమూర్తి, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి దయానిధితో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణకు చేపడుతున్న ఏర్పాట్లు, ఓటర్ల జాబితాల తయారీ, పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, వార్డుల పునర్విభజన తదితర అంశాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. వార్డుల రిజర్వేషన్లపై తుది నిర్ణయం సంబంధిత చట్టాలు, నిబంధనల ప్రకారం తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎస్‌. సుధాకర్‌, బీఎస్పీ నుంచి పి. శివప్రసాద్‌రావు, రమేష్‌, ఎస్‌కే సుభాష్‌, టీడీపీ నుంచి రాజశేఖర్‌, జనసేన నుంచి దుర్గాప్రసాద్‌, వైఎస్సార్‌సీపీ నుంచి కట్టుమూరి సతీష్‌, ఎం. రవి, బీజేపీ నుంచి ఎంఎంవీ పరశురాంరాజు, రాకేష్‌ తదితర రాజకీయ పార్టీల ప్రతినిధులు, జీవీఎంసీ అదనపు కమిషనర్లు పీఎం సత్యవేణి, కె.రమేష్‌, ఎస్‌ఎస్‌ వర్మ, పి.నల్లనయ్య పాల్గొన్నారు.

పార్టీల ప్రతినిధులతో

కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ సమీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement