ఎన్నిసార్లు తిరగాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్నిసార్లు తిరగాలి

Sep 29 2026 1:33 AM | Updated on Sep 29 2026 1:33 AM

● పీజీఆర్‌ఎస్‌.. పరిష్కారం ఎక్కడ? ● బాధితుల అసంతృప్తి

దళితులపై దాడులకు

నిరసనగా బీఎస్పీ ధర్నా

రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు, హత్యలు, సామాజిక వివక్షకు నిరసనగా బహుజన్‌ సమాజ్‌ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద నిర్వహించారు. ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు రమేష్‌ నాయకత్వంలో కలెక్టర్‌ కార్యాలయంలోని పీజీఆర్‌ఎస్‌లో వినతి పత్రం సమర్పించి, అనంతరం కలెక్టరేట్‌ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు.కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కో కన్వీనర్‌ పెద్దాడ కనక మహాలక్ష్మి, సిటీ కన్వీనర్‌ అదపాక దాలి రాజు, పార్లమెంట్‌ ఇన్‌చార్జులు తదితరులు పాల్గొన్నారు.

మహారాణిపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందుతున్న వినతుల పరిష్కారంపై అర్జీదారుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రతి సోమవా రం పీజీఆర్‌ఎస్‌లో వినతులు అందిస్తున్నప్పటికీ, కొన్ని సమస్యలు పదేపదే సమర్పించాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. పరిష్కార వివరాలతో కూడిన ఎండార్స్‌మెంట్లు సక్రమంగా లేకపోవడం, క్షేత్రస్థాయిలో పరిశీలన జరగకపోవడం వల్ల సమస్యలు రీ–ఓపెన్‌ అవుతున్నాయని అర్జీదారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదులను పూర్తిస్థాయిలో పరిష్కరించి, తిరిగి రీ–ఓపెన్‌ కాకుండా చూడాలని కలెక్టర్‌ ఎం. అభిషిక్త్‌ కిశోర్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఫిర్యాదుదారులతో సంబంధిత శాఖల అధికారులు నేరుగా మాట్లాడి సమస్యను అర్థం చేసుకోవాలని, క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యమైన పరిష్కారం చూపాలని సూచించారు. ఫిర్యాదులను క్లోజ్‌ చేసే సమయంలో తీసుకున్న చర్యలపై స్పష్టమైన ఎండార్స్‌మెంట్‌ ఇవ్వాలని, సర్వీస్‌ కేటగిరీ, రీ–ఓపెన్‌ అవుతున్న ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరిగేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని స్పష్టం చేశారు. అనంతరం ప్రజల నుంచి వినతులు స్వీకరించగా మొత్తం 268 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇందులో రెవెన్యూ క్లినిక్‌కు 14, జీవీఎంసీకి 58, పోలీస్‌ శాఖకు 31, ఇతర శాఖలకు 165 ఫిర్యాదులు ఉన్నాయి. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ గొబ్బిళ్ల విద్యాధరి, డీఆర్వో ఎం. విశ్వేశ్వరనాయుడు, అదనపు కమిషనర్‌ రమేష్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

లే అవుట్‌లో రహదారులు కలిపేశారు

పద్మనాభం మండలం రేవిడి గ్రామంలో తమ వ్యవసాయ భూములకు వెళ్లేందుకు రహదారి కల్పించాలని కోరుతూ గ్రామానికి చెందిన సారిక నర్సు నాయుడు సోమవారం పీజీఆర్‌ఎస్‌లో వినతి పత్రం అందజేశారు. సర్వే నంబర్‌ 35, 35/1లో తమకు జీరాయితీ భూములు ఉన్నాయని, ఓ ప్రైవేటు లే అవుట్‌ నిర్వాహకులు గ్రామ రహదారులను లే అవుట్‌లో కలిపేసుకోవడంతో 35 మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ విషయంపై తహసీల్దార్‌, భీమిలి ఆర్డీవో, వీఎంఆర్‌డీఏ అధికారులకు వినతులు ఇచ్చినా స్పందన లేదన్నారు. కలెక్టర్‌ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు.

ప్రభుత్వ స్థలం అప్పగింతపై విచారణ కోరుతూ ఫిర్యాదు

ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించిన తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి నాయకుడు కింతాడ రాజశేఖర్‌ కోరారు. సోమవారం పీజీఆర్‌ఎస్‌లో వినతి పత్రం అందజేశారు. 59వ వార్డు ఎక్స్‌ సర్వీసెస్‌మెన్‌ కాలనీలో సర్వే నంబర్‌ 38లో కొండ పోరంబోకు ప్రభుత్వ స్థలాన్ని తప్పుడు పట్టాలతో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై గతంలో ఆర్డీవో, పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదులు చేసినా స్పందన లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement