నాట్య రసధారలో వైశాఖీ వేడుకలు | - | Sakshi
Sakshi News home page

నాట్య రసధారలో వైశాఖీ వేడుకలు

Sep 28 2026 12:59 AM | Updated on Sep 28 2026 12:59 AM

మద్దిలపాలెం: నటరాజ్‌ మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక ‘వైశాఖీ నృత్యోత్సవ్‌–2026’ అఖిల భారత జాతీయ నృత్యోత్సవం ఆదివారం ముగిసింది. రెండో రోజు ప్రదర్శనలు ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. ఎలాంటి ప్రభుత్వ, ప్రభుత్వేతర ఆర్థిక సహాయం లేకుండా ఈ ఉత్సవాలను నిర్వహించడం వరుసగా ఇది 18వ ఏడాది. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, ఉత్సవ సంచాలకులు బీఆర్‌ విక్రమ్‌ కుమార్‌ (గౌడ్‌) ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో కర్ణాటకకు చెందిన సంగీత నాటక అకాడెమీ అవార్డు గ్రహీత డాక్టర్‌ వసుంధర దొరస్వామి బృందం భరతనాట్యం, రాజస్థాన్‌కు చెందిన అఫ్‌సాన్‌ గుజరావత్‌ బృందం చక్రి జానపద నృత్యాలతో అలరించాయి. నాట్యారాధన ఆర్ట్స్‌ అకాడమీ నాట్యాచారిణి నంబాల జ్యోతి శిష్య బృందం, సంయుక్త మ్యాజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ అకాడమీ నాట్యాచారిణి కాకర అరుణా పరమేష్‌ బృందం, ఎన్‌ఎండీఏ వ్యవస్థాపక నాట్యాచారిణి కేవీ లక్ష్మి శిష్య బృందం, ఆదిత్యశ్రీ సారధ్యంలోని శ్రీకృష్ణ కళామందిర్‌ బృందం, నిర్మలా నృత్య నికేతన్‌ నాట్యాచారిణి బి. విజయ జ్యోతి బృందాలు కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యాలు ప్రదర్శించాయి. ఈ సందర్భంగా సీఎంఆర్‌ అధినేత మావూరి వెంకటరమణకు వైశాఖీ రాజపోషక పురస్కారం అందజేశారు. డాక్టర్‌ వసుంధరా దొరస్వామికి పద్మభూషణ్‌ గురు డాక్టర్‌ సరోజా వైద్యనాథన్‌ ఎక్స్‌లెన్సీ అవార్డు, అఫ్‌సాన్‌ గుజరావత్‌కు వైశాఖీ యువ పురస్కారం, పవిత్ర కృష్ణ భట్‌కు పద్మభూషణ్‌ గురు డాక్టర్‌ సరోజా వైద్యనాథన్‌ యువ పురస్కారం అందించారు. వైశాఖీ బెస్ట్‌ టీచర్‌ అవార్డులను నంబాల జ్యోతి (జానపదం), అరుణా పరమేష్‌ కాకర (కూచిపూడి), ఆదిత్యశ్రీ (భరతనాట్యం), నటరాజ్‌ మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ అకాడెమీ ప్రిన్సిపాల్‌ కేవీ లక్ష్మి (కూచిపూడి), విజయ జ్యోతి, వెంకట్‌ (భరతనాట్యం) అందుకున్నారు. కార్యక్రమానికి డాక్టర్‌ పేరాల బాల మురళీ కృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సరోజా వైద్యనాథన్‌ తనయుడు గణేష్‌ నాట్యాలయ సీఈవో ఢిల్లీకి చెందిన సీవీ కామేష్‌, ఎన్‌ఎండీఏ ఛైర్మన్‌ రవిశంకర్‌ నారాయణ్‌, ఛీఫ్‌ కమిషనర్‌ ఇన్‌కం టాక్సెస్‌ సిరికుమార్‌, అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పి. ఉషశ్రీ, నాట్య ప్రముఖులు కళాకృష్ణ, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement