నామమాత్రంగా స్టాల్స్..సందర్శకులు కరవు
గిరిజన ఉత్పత్తులు, చేనేత వస్త్రాల ప్రదర్శనకూ దూరం
మొక్కుబడిగా పర్యాటక శాఖ ఏర్పాట్లు
బీచ్‌రోడ్డు: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సిరిపురం జంక్షన్‌లో నిర్వహించిన వేడుకలు తూతూమంత్రంగా ముగిశాయి. ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలను ఈసారి కేవలం స్టాల్స్ ఏర్పాటుతోనే మమ అనిపించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని ప్రధాన ప్రాంతంలో 10–15 స్టాల్స్ ఏర్పాటు చేసినా సందర్శకులను ఆకట్టుకునేలా ఎలాంటి ప్రత్యేకత కనిపించలేదు. విశాఖ పర్యాటక ప్రాంతాలైన అరకు, బొర్రా గుహలు, కై లాసగిరి, ఆర్‌కే బీచ్ విశిష్టతను తెలిపే ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేయలేదు. గిరిజన ఉత్పత్తులు, చేనేత వస్త్రాల ప్రదర్శనకూ చోటు కల్పించలేదు. కేవలం కొన్ని ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీల బ్రోచర్లను స్టాల్స్‌లో ఉంచి కార్యక్రమాన్ని ముగించారు. దీంతో స్టాల్స్ వద్దకు సందర్శకులు పెద్దగా రాకపోవడంతో నిర్వాహకులు ఖాళీ కుర్చీల్లో కూర్చొని కాలక్షేపం చేయాల్సిన పరిస్థితి నెలకొంది.


