మహారాణిపేట : ఇంజనీర్స్ డే సందర్భంగా ఏపీఎస్‌ఈబీ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య కాంస్య విగ్రహాన్ని సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ విశ్వేశ్వరయ్య సాంకేతిక ప్రతిభ, నిస్వార్థ ప్రజాసేవ స్ఫూర్తిగా ఇంజనీర్లు పనిచేయాలన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని విద్యుత్ రంగ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డైరెక్టర్లు టి.వి.సూర్యప్రకాష్, టి.వనజ, ఏపీఎస్‌ఈబీ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


