సౌత్‌కోస్ట్‌ రైల్వే డీజీఎంగా శ్రీనివాసు | - | Sakshi
Sakshi News home page

సౌత్‌కోస్ట్‌ రైల్వే డీజీఎంగా శ్రీనివాసు

Sep 16 2026 4:13 AM | Updated on Sep 16 2026 4:13 AM

తాటిచెట్లపాలెం: సౌత్‌కోస్ట్‌ రైల్వే డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌(జనరల్‌)గా నియమితులైన నాగ రొంగల శ్రీనివాసు మంగళవారం బాధ్యతలను స్వీకరించారు. 2011 ఇండియన్‌ రైల్వే సర్వీస్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీర్స్‌ బ్యాచ్‌కు చెందిన ఈయనకు కీలక సాంకేతిక, అధునాతన పద్ధతుల్లో విశేష అనుభవం ఉందని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. శ్రీనివాసు గతంలో సౌత్‌ కోస్ట్‌రైల్వే, లోకోమోటివ్స్‌ ఆపరేషన్స్‌లో డిప్యూటీ చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌గా, ఎలక్ట్రిక్‌ లోకోషెడ్‌ రాయపురంలో సీనియర్‌ డివిజనల్‌ ఇంజినీర్‌గా, ఎలక్ట్రిక్‌ లోకో షెడ్‌, అరక్కోణంలో సీనియర్‌ డివిజనల్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌గా పనిచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement