విశాఖ మార్కెట్‌లోకి ‘టయోటా హైలక్స్‌ 2026’ | - | Sakshi
Sakshi News home page

విశాఖ మార్కెట్‌లోకి ‘టయోటా హైలక్స్‌ 2026’

Sep 13 2026 9:10 AM | Updated on Sep 13 2026 9:10 AM

మహారాణిపేట: విశాఖలో మోడీ టయోటా ఆధ్వర్యంలో సరికొత్త ‘టయోటా హైలక్స్‌ 2026’వాహనాన్ని శనివారం ఆవిష్కరించారు. బలం, భద్రత, సౌకర్యం, అడ్వెంచర్‌ లక్షణాలతో రూపొందిన ఈ మోడల్‌కు ఆటోమొబైల్‌ ప్రియుల నుంచి విశేష స్పందన లభించింది. నూతన హైలక్స్‌ 2026లో శక్తివంతమైన 2.8 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌తో పాటు 6–స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ అందుబాటులో ఉంది. 2డబ్ల్యూడీ, 4 డబ్ల్యూడీ ఆప్షన్లలో లభించే ఈ వాహనం 204 బీహెచ్‌పీ పవర్‌, 500 ఎన్‌ఎం టార్క్‌ను అందిస్తూ మెరుగైన పనితీరును ప్రదర్శిస్తుందని షోరూం ప్రతినిధులు తెలిపారు. భద్రతపరంగా 7 ఎయిర్‌బ్యాగులు, వెహికల్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, టైర్‌ ప్రెజర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయని చెప్పారు. ఏడీసీపీ నరసింహమూర్తి, మోడీ టయోటా సేల్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆచార్య, సర్వీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఓవీఎస్‌ అవినాష్‌, సేల్స్‌ మేనేజర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement