చాకచక్యంతో కాపాడిన పోలీసులు | - | Sakshi
Sakshi News home page

చాకచక్యంతో కాపాడిన పోలీసులు

Sep 13 2026 9:10 AM | Updated on Sep 13 2026 9:10 AM

యువతి ఆత్మహత్యాయత్నం

పెందుర్తి: ఇంట్లో జరిగిన వివాదం కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ యువతిని పోలీసులు చాకచక్యంగా రక్షించారు. వివరాలివి. స్థానిక టీచర్స్‌ కాలనీలో ఓ యువతి(19) తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటుంది. శనివారం మధ్యాహ్నం ఇంట్లో చిన్నపాటి వివాదం జరిగింది. ఈ క్రమంలో సదరు యువతి తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఆమె తీరుపై అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా తలుపు తీయలేదు. తక్షణమే పెందుర్తి పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన సీఐ కె.వి.సతీష్‌కుమార్‌ ఆదేశాల మేరకు బ్లూకోట్స్‌ పీసీ చంద్రశేఖర్‌ అక్కడికి చేరుకుని తలుపును బలవంతంగా తెరిచారు. అప్పటికే ఉరికి వేళాడుతున్న యువతిని కిందకి దించడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. ప్రాథమిక చికిత్స అనంతరం యువతితో పాటు తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement