మద్దిలపాలెం: అంతర్జాతీయంగా ఖ్యాతి గాంచిన భరతనాట్య నర్తకి, నృత్య దర్శకురాలు, పరిశోధకురాలు డాక్టర్ వసుంధరా దొరస్వామి 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక ‘పద్మభూషణ్ గురు డాక్టర్ సరోజా వైద్యనాథన్ ఎక్సలెన్స్ అవార్డు’కు ఎంపికయ్యారు. ఈ నెల 26, 27 తేదీల్లో మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించనున్న ‘వైశాఖి నృత్యోత్సవ్’సందర్భంగా ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్టు నటరాజ్ మ్యూజిక్–డాన్స్ అకాడమీ వ్యవస్థాపకుడు బి.ఆర్.విక్రమ్ గౌడ్ తెలిపారు. అష్టాంగ యోగాతో భరతనాట్యానికి కొత్త శక్తి
మైసూరుకు చెందిన డాక్టర్ వసుంధరా దొరస్వామి ఏడు దశాబ్దాల సుదీర్ఘ నృత్య ప్రయాణంతో శాసీ్త్రయ నృత్యరంగంలో ప్రత్యేక స్థానం సంపాదించారు. అష్టాంగ విన్యాస యోగాను భరతనాట్యంతో సమన్వయం చేసిన తొలి కళాకారిణిగా గుర్తింపు పొందిన ఆమె.. గురు శ్రీ పట్టాభి జోయిస్ వద్ద శిక్షణ పొంది ఈ రెండు కళల అనుసంధానంపై పరిశోధన చేసి డాక్టరేట్ సాధించారు. ‘పాంచాలి’, ‘గంగా లహరి’, ‘సామవేద’వంటి ఆమె సోలో నృత్య రూపకాలు విశేష ప్రశంసలు అందుకున్నాయి.


