మహారాణిపేట: అగ్నివీర్ పథకంలో భాగంగా బుధవారం నుంచి ఆర్మీ నియామక ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీ ఈనెల 20వ తేదీ వరకు కొనసాగనుంది. వివిధ జిల్లాలకు చెందిన రాత పరీక్షలో ఉత్తీర్ణులైన 10,350 మంది అభ్యర్థులు ఈ ర్యాలీకి హాజరుకానున్నారు. సెలక్షన్ ప్రక్రియలో భాగంగా 1.6 కిలోమీటర్ల రన్నింగ్ కోసం ఆర్కే బీచ్‌రోడ్డులో పార్క్ హోటల్ జంక్షన్ నుంచి విశ్వప్రియ కల్యాణమండపం వరకు ట్రాక్ ఏర్పాటు చేశారు. ఆర్మీ నియామక ర్యాలీ నేపథ్యంలో బుధవారం నుంచి ఈనెల 20వ తేదీ వరకు బీచ్‌రోడ్డులో ఎలాంటి వాహనాలకూ అనుమతి ఉండదు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించి, ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి సహకరించాలని అధికారులు కోరారు.


