డాబాగార్డెన్స్: ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీ ప్రస్తుతం 30 శాతంగా ఉందని రవాణా, క్రీడల శాఖ మంత్రి రాంప్రసాదరెడ్డి తెలిపారు. విశాఖపట్నం నుంచి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి నడుస్తున్న ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సుల నిర్వహణను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు నిర్ణీత సమయపట్టిక ప్రకారం సమయపాలనతో నడుస్తున్నాయని అధికారులు మంత్రికి వివరించారు. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు ఏరో ఎక్స్‌ప్రెస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. తక్కువ చార్జీలతో రూ.50 నుంచి రూ.400 వరకు ఈ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆర్టీసీ ఆర్‌ఎం బి.అప్పలనాయుడు, డిప్యూటీ సీటీఎం కె.పద్మావతి, డీఈఎంఈ ఎ.గంగాధర్, డిపో మేనేజర్లు పాల్గొన్నారు.


