మహారాణిపేట: కార్గిల్ దివస్ సందర్భంగా ఎన్‌ఎస్‌టీఎల్–డీఆర్‌డీవో ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఎన్‌ఎస్‌టీఎల్ డైరెక్టర్ డాక్టర్ అబ్రహం వర్గీస్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం రీజనల్ హెడ్ జె.సింహాచలం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం వారు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అదనపు డైరెక్టర్ హెచ్‌ఎన్ దాస్, సీనియర్ సైంటిస్ట్ మిధిలేష్ సాహూ, యూనియన్ అధ్యక్షుడు అకిరి సునీల్, సెక్రటరీ నాగభూషణం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈబీసీ హెడ్ పి.రాజేష్, ప్రాంతీయ ఇన్స్యూరెన్స్ హెడ్ ఐటీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


