బీచ్‌రోడ్డు: మానసిక ఆరోగ్య రంగంలోని తాజా పరిశోధనలు, ఆధునిక చికిత్సా విధానాలు, సాంకేతిక పరిజ్ఞానంపై వైద్యులకు అవగాహన కల్పించడమే రాష్ట్రస్థాయి శాసీ్త్రయ సదస్సు లక్ష్యమని ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా. సంధ్యాదేవి తెలిపారు. ప్రభుత్వ మానసిక వైద్యశాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో భారతీయ మానసిక వైద్యుల సంఘం, విశాఖ సైకియాట్రిక్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఏపీసైకాన్–2026 రాష్ట్రస్థాయి మానసిక వైద్యుల శాసీ్త్రయ సదస్సు శనివారం నిర్వహించారు. సదస్సులో పరిశోధనా పత్రాల ప్రదర్శనలు, ఉత్తమ పీజీ పరిశోధనా పత్రాల అవార్డులు, యువ వైద్యుల క్విజ్ పోటీలు నిర్వహించారు. సమగ్ర మానసిక ఆరోగ్య సేవలు, కన్సల్టేషన్–లయజన్ సైకియాట్రీలో నైతిక, చట్టపరమైన అంశాలు, గట్–బ్రెయిన్ యాక్సిస్ పాత్ర, ట్రామా, డిసోసియేషన్, యువత మానసిక ఆరోగ్యం, ఆటో ఇమ్యూన్ ఎన్సెఫలైటిస్, లైంగిక సమస్యలు, క్లినికల్ ప్రాక్టీస్‌లో కృత్రిమ మేధస్సు వినియోగం వంటి అంశాలపై నిపుణులు శాసీ్త్రయ ఉపన్యాసాలు ఇచ్చారు. కార్యక్రమంలో ఏడీఎంఈ డా.వి.రాధికా రెడ్డి, సదస్సు నిర్వహణ అధ్యక్షురాలు డా.వి.విజయలక్ష్మి, ఉపాధ్యక్షుడు డా.కె.వి.రామిరెడ్డి, కార్యదర్శి డా.కె.మాధవీలత తదితరులు పాల్గొన్నారు.


