యశ్వంత్‌ వర్మపై కేసు నమోదు చేయాలి | - | Sakshi
Sakshi News home page

యశ్వంత్‌ వర్మపై కేసు నమోదు చేయాలి

Jul 12 2026 12:29 AM | Updated on Jul 12 2026 12:29 AM

సీతంపేట: ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి యశ్వంత్‌ వర్మ నివాసంలో గతేడాది మార్చిలో దొరికిన కాలిన నగదు కట్టలు ఘటనపై కె.వీరాస్వామి తీర్పు ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని విస్తృత దళిత సంఘాల(విదసం) ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ బూసి వెంకటరావు డిమాండ్‌ చేశారు. బుల్లయ్య కళాశాల దరి అంబేడ్కర్‌ భవన్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ న్యాయమూర్తి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన సాధారణ పౌరుడేనని, ఈ నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేయడానికి భారత ప్రధాన న్యాయమూర్తి అనుమతి అవసరం లేదని కె.వీరాస్వామి వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా తీర్పు(1991) స్పష్టం చేసిందన్నారు. ఈ అంశంపై రెండు నెలల క్రితమే రాష్ట్రపతి, భారత ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన రాలేదని తెలిపారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి యశ్వంత్‌ వర్మపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరారు. గుడివాడ ప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో విదసం రాష్ట్ర, జిల్లా నాయకులు బూల భాస్కరరావు, ఎడ్ల గోపి, ఫ్రాన్సిస్‌, మట్ల అప్పారావు, గుబ్బల శ్రీనివాసరావు, ఉభా చిన్ని, గోడు వెంకటేశ్వరరావు, గుడిబాద భాస్కరరావు పాల్గొన్నారు.

రాష్ట్రపతి, సీజేఐ

స్పందించాలని విదసం డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement