కంచరపాలెం: జీవీఎంసీ 47వ వార్డు కప్పరాడ ప్రాంతంలో హెచ్‌టీ విద్యుత్ లైన్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. కంచరపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కప్పరాడకు చెందిన యల్లబిల్లి వరహా నర్సింగరావు (43) శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఇంటి మేడపైకి ఐరన్ నిచ్చెన (ల్యాడర్) తీసుకెళ్తుండగా, అది సమీపంలో ఉన్న హెచ్‌టీ విద్యుత్ తీగలకు అనుకోకుండా తగిలింది. దీంతో ఆయనకు తీవ్ర విద్యుత్ షాక్ తగిలి కిందపడిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే కేజీహెచ్ అత్యవసర విభాగానికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి సోదరుడు యల్లబిల్లి మంగపతిరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐదో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ కోరాడ రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.


