పేదల ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

పేదల ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు చర్యలు

Jun 12 2026 7:31 AM | Updated on Jun 12 2026 7:31 AM

మహారాణిపేట: ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదల స్థలాలను క్రమబద్ధీకరణ చేసి హక్కులు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో రెవిన్యూ అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని రెగ్యులరైజేషన్‌ చేసిన స్థలాల పట్టాలను సీఎం చేతుల మీదుగా ఆగస్ట్‌ నెలలో పంపిణీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. అనంతరం 22ఏ భూములు, వాటర్‌ బాడీస్‌, పంచ గ్రామాల సమస్యలపై చర్చించారు. ఎమ్మెల్యేలు పలు భూ సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, పి.వి.జి.ఆర్‌.నాయుడు, వెలగపూడి రామకృష్ణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్‌, విష్ణుకుమార్‌రాజు, పంచకర్ల రమేష్‌బాబు, ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవిరావు, జాయింట్‌ కలెక్టర్‌ విద్యాధరి, డీఆర్వో ఎం.విశ్వేశ్వర నాయుడు, ఆర్డీవోలు దిలీప్‌ చక్రవర్తి, సంగీత్‌ మాధుర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement