పార్టీ పంథా | - | Sakshi
Sakshi News home page

పార్టీ పంథా

Mar 13 2026 7:34 AM | Updated on Mar 13 2026 7:34 AM

జన హితమే

సాక్షి, విశాఖపట్నం: పార్టీ కోసం ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పిలుపునిచ్చారు. వైఎస్సార్‌ సీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకూ పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో గురువారం పార్టీ జిల్లా వలంటీర్ల విభాగం అధ్యక్షుడు పీలా ప్రేమ కిరణ్‌ జగదీష్‌ నిర్వహణలో వైఎస్సార్‌ సీపీ 16వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్సార్‌ సీపీ 15 వసంతాలు పూర్తి చేసుకుని 16వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా కేకే రాజు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సమన్వయకర్తలు మళ్ల విజయప్రసాద్‌, వాసుపల్లి గణేష్‌కుమార్‌, తిప్పల దేవన్‌రెడ్డి, మొల్లి అప్పారావు, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు తదితరులతో కలిసి ఆయన వైఎస్సార్‌, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్‌ కట్‌ చేసి పార్టీ శ్రేణులకు పంచిపెట్టారు.

ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ.. వైఎస్సార్‌ సీపీ 15 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో చారిత్రాత్మక విజయాలను సాధించిందని గుర్తుచేశారు. పార్టీ అభివృద్ధి కోసం శ్రమిస్తున్న నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రజలకు సేవ చేయడంలో ప్రతి ఒక్కరూ అంకితభావంతో పని చేయాలని కోరారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అనేక అభివృద్ధి పనులు, ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పన, విద్యా సంస్థల నిర్మాణాలు నిలిచిపోయాయని విమర్శించారు. గత ప్రభుత్వం నిర్మించిన సచివాలయాలు, ఆర్‌బీకేలు నిర్వీర్యం అవుతున్నాయని, ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం బీచ్‌రోడ్‌లోని పార్క్‌ హోటల్‌ జంక్షన్‌ వద్ద తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న వైఎస్సార్‌ విగ్రహానికి గజమాల వేసి నివాళులర్పించారు.

కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, సీఈసీ సభ్యుడు కోలా గురువులు, పరిశీలకులు రొంగలి జగన్నాథం, బాణాల శ్రీనివాసరావు, ఎస్‌ఈసీ సభ్యులు డాక్టర్‌ జహీర్‌ అహ్మద్‌, పి.సతీష్‌ వర్మ, ఐ.హెచ్‌.ఫరూఖీ, పీలా వెంకట లక్ష్మి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌ గాంధీ, ముఖ్య నాయకులు బొల్లవరపు జాన్‌వెస్లీ, పేర్ల విజయ్‌ చంద్ర, జి.వి.రవిరాజు, పల్లా దుర్గారావు, గుడ్ల వెంకట రమణి రెడ్డి, దుప్పలపూడి శ్రీనివాసరావు, జి.వి.రామచంద్రరావు, ద్రోణంరాజు శ్రీవాస్తవ, సేనాపతి అప్పారావు, అంబటి నాగ శైలేష్‌, ముట్టి సునీల్‌ కుమార్‌, ఉరుకూటి చందు, దేవరకొండ మార్కండేయులు, సనపల రవీంద్ర భరత్‌, కె.కల్పన, కర్రి రామారెడ్డి, మారుతీ ప్రసాద్‌, బొండా ఉమా మహేశ్వరరావు, నీలి రవి, కొణతాల ఉమా మహేశ్వరరావు, ఎం.పట్నాయక్‌, సాయి, వేంపాడు శ్రీనివాస్‌ రెడ్డి, కటారి అనిల్‌ కుమార్‌, అల్లు శంకరరావు, నడింపల్లి కృష్ణ రాజు, అల్లంపల్లి రాజబాబు, ఆల్ఫా కృష్ణ, బాకీ శ్యాంకుమార్‌రెడ్డి, చిన్ని, రామ్‌ రాజు, బిపిన్‌ కుమార్‌ జైన్‌, వావిలపల్లి ప్రసాద్‌, రెయ్యి వెంకట రమణ, బర్కత్‌ అలీ, బల్లా శ్రీనివాస్‌, చొల్లంగి నాగేశ్వరరావు, యనమరెడ్డి కుమార్‌ రెడ్డి, మధుపాద రవి కుమార్‌, పి.గోవింద్‌, బి.రమణ రెడ్డి, బొడ్డేటి కిరణ్‌ కుమార్‌, డొప్ప శ్రీను, ఇంటి రవి కుమార్‌, లాలం వేణుగోపాల్‌, గోదేసి శ్రీనివాస్‌రెడ్డి, గుజ్జి ధీరజ్‌ కుమార్‌, బి.పద్మావతి, ఎస్‌.సుబ్బిరెడ్డి, కృపాజ్యోతి, రామన్న పాత్రుడు, చొక్కర శేఖర్‌, సత్తి మందారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement