అల్లిపురం: నగరంలోని ఓ హోటల్ తిష్ట వేసి నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న 10 మందిని మహారాణిపేట పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి రూ.37,32,000 నకిలీ రూ.2వేల నోట్లు, రూ.3 లక్షల 18 వేల ఒరిజినల్ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్ ఏసీపీ కె.లక్ష్మణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. మహారాణిపేట ఇన్‌స్పెక్టర్ జి.దివాకర్ యాదవ్‌కి అందిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్సు సిబ్బందితో కలిసి మంగళవారం రాత్రి జగదాంబ నుంచి కలెక్టర్ ఆఫీస్‌కి వెళ్లే రోడ్డులో వాహన తనిఖీలు చేపట్టారు. కారుతో పాటు ముగ్గురు వ్యక్తులను, రూ.37,32,000 విలువ గల రూ.2వేలు నకిలీ కరెన్సీ నోట్లు, రూ.3,18,000 విలువ కలిగిన ఒరిజినల్ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు సంఘం శరత్ థియేటర్ వెనుక ఉన్న ఓ లాడ్జిలో ఉన్న మిగతా ఏడుగురు సభ్యులతో పాటు రూ.38,000 విలువ గల రూ.500 నకిలీ కరెన్సీ నోట్లు, రూ.16,500 విలువ కలిగిన ఒరిజినల్ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై 180,318(4), 62, 3(5) బీఎన్‌ఎస్ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
రూ.37,32,000 నకిలీ కరెన్సీ, రూ.3,18,000 నగదు స్వాధీనం


