ఆకట్టుకుంటున్న నేషనల్‌ సిల్క్‌ ఎక్స్‌పో | - | Sakshi
Sakshi News home page

ఆకట్టుకుంటున్న నేషనల్‌ సిల్క్‌ ఎక్స్‌పో

Feb 8 2026 3:48 AM | Updated on Feb 8 2026 3:48 AM

ఆకట్ట

ఆకట్టుకుంటున్న నేషనల్‌ సిల్క్‌ ఎక్స్‌పో

అల్లిపురం: తెలుగు సంవత్సరాది ఉగాది, వివాహాల సీజన్‌ను పురస్కరించుకుని ‘నేషనల్‌ సిల్క్‌ ఎక్స్‌పో’ సంప్రదాయ వస్త్ర ప్రదర్శనను వాల్తేరు మెయిన్‌ రోడ్డులోని హోటల్‌ గ్రీన్‌ పార్క్‌లో నిర్వహిస్తున్నారు. శనివారం ప్రారంభమైన ఈ ఎక్స్‌పో ఈ నెల 11వ తేదీ వరకు కొనసాగనుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత పట్టు చీరలు, డిజైనర్‌ వస్త్రాలు, బ్లౌజులు, కుర్తీలు, దుపట్టాలు, సల్వార్‌ మెటీరియల్‌ ఒకేచోట ప్రదర్శనలో ఉన్నాయి. పైథానీ, బెంగళూరు సిల్క్‌, కంజీవరం, బనారస్‌, చందేరి, మహేశ్వరి, జమ్దానీ, బలుచారి, బంధిని, భాగల్పూర్‌, కశ్మీర్‌ సిల్క్‌ తదితర ప్రసిద్ధ చేనేత ఉత్పత్తులు లభిస్తున్నాయి. దేశ నలుమూలల నుంచి వచ్చిన నేత కార్మికులు తమ ఉత్పత్తులను 50 శాతం వరకు తగ్గింపుతో విక్రయిస్తున్నారు. ఈ ప్రదర్శన ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. ప్రవేశం ఉచితం. అన్ని డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు స్వీకరిస్తారు.

ఆకట్టుకుంటున్న నేషనల్‌ సిల్క్‌ ఎక్స్‌పో 1
1/1

ఆకట్టుకుంటున్న నేషనల్‌ సిల్క్‌ ఎక్స్‌పో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement