ఐఎఫ్‌ఆర్‌ పనుల పర్యవేక్షణ | - | Sakshi
Sakshi News home page

ఐఎఫ్‌ఆర్‌ పనుల పర్యవేక్షణ

Feb 6 2026 7:21 AM | Updated on Feb 6 2026 7:21 AM

ఐఎఫ్‌ఆర్‌ పనుల పర్యవేక్షణ

ఐఎఫ్‌ఆర్‌ పనుల పర్యవేక్షణ

ఏయూక్యాంపస్‌: ఈ నెల 18, 19 తేదీల్లో విశాఖలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న అంతర్జాతీయ యుద్ధ నౌకల విన్యాసాల నేపథ్యంలో, వీఎంఆర్‌డీఏ పరిధిలోని పర్యాటక ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని చైర్మన్‌ ఎంవీ ప్రణవ్‌ గోపాల్‌, మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ తేజ్‌ భరత్‌ అధికారులను ఆదేశించారు. గురువారం వారు క్షేత్రస్థాయిలో పర్యటించి కుర్సుర సబ్‌ మైరెన్‌, సీహారియర్‌, హెలికాప్టర్‌ మ్యూజియం, టీయూ–142 యుద్ధ విమాన మ్యూజియంలతో పాటు కై లాసగిరి, తెన్నేటి పార్కుల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యాటక ప్రాంతాల్లో మరమ్మత్తులు, పచ్చదనం పెంపు పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. సందర్శకులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ అంతర్జాతీయ వేడుకను విజయవంతం చేయాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement