మాట నిలబెట్టుకున్నాం
మా మత్స్యకారులను క్షేమంగా తీసుకువస్తామని వారి కుటుంబాలకు మాట ఇచ్చాం, ఆ మాట నిలబెట్టుకున్నందుకు చాలా గర్వంగా ఉంది. బంగ్లాదేశ్ అధికారులతో మాట్లాడి, జైలులో ఉన్న మనవారికి ధైర్యం చెప్పడమే కాకుండా.. వారి విడుదల కోసం నాలుగు నెలల పాటు నిరంతరం శ్రమించాం. ఈ మానవతా ప్రయత్నంలో సహకరించిన భారత హైకమిషన్ (ఢాకా), ఖుల్నా అసిస్టెంట్ హైకమిషన్, ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు. అందరి సమన్వయంతోనే ఈ విజయం సాధ్యమైంది.
–వాసుపల్లి జానకి రామ్


