పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ బ్రాంచ్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ బ్రాంచ్‌ ప్రారంభం

Feb 3 2026 8:00 AM | Updated on Feb 3 2026 8:00 AM

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ బ్రాంచ్‌ ప్రారంభం

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ బ్రాంచ్‌ ప్రారంభం

కొమ్మాది: జీవీఎంసీ 8వ వార్డు ఎండాడలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) బ్రాంచ్‌ను బ్యాంక్‌ జోనల్‌ మేనేజర్‌ వందన పాండే సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు మరింత చేరువలో ఉండేందుకు అన్ని చోట్ల బ్రాంచ్‌లు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇది తమ 69వ బ్రాంచ్‌ అన్నారు. ప్రతి బ్రాంచ్‌లో రిటైల్‌, అగ్రి సంబంధిత అన్ని బ్యాంకింగ్‌ ఉత్పత్తులు, సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. రానున్న 132వ వ్యవస్థాపన దినోత్సవం నాటికి డిజిటల్‌ లెండింగ్‌లో రూ.లక్ష కోట్ల లక్ష్యాన్ని సాధించేందుకు బ్యాంక్‌ కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ ఆనంద్‌ కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement