అదనపు ఆర్టీసీ బస్సులు నడపాలి: ఎస్‌ఎఫ్‌ఐ
జిల్లాలో కళాశాలలకు వెళ్లే విద్యార్థుల కోసం ఆయా సమయాల్లో అదనపు ఆర్టీసీ బస్సులు నడపాలని ఎస్‌ఎఫ్‌ఐ ప్రతినిధులు కలెక్టర్‌ను కోరారు. విద్యార్థులకు ఉచిత లేదా రాయితీ బస్ పాసులు అందించాలన్నారు. విద్యార్థుల విద్యా హక్కును కాపాడేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని లేకుంటే విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ఎస్‌ఎఫ్‌ఐ విశాఖ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి.అజయ్, డి.వెంకటరమణతో పాటు కమిటీ సభ్యులు నరేష్, భరత్, ప్రగతి, ధనుష్, పలు కళాశాలల విద్యార్థులు ఉన్నారు.


