కుట్రలు బట్టబయలయ్యేసరికి అబద ్ధపు ఫ్లెక్సీలు | - | Sakshi
Sakshi News home page

కుట్రలు బట్టబయలయ్యేసరికి అబద ్ధపు ఫ్లెక్సీలు

Feb 3 2026 8:00 AM | Updated on Feb 3 2026 8:00 AM

కుట్రలు బట్టబయలయ్యేసరికి అబద ్ధపు ఫ్లెక్సీలు

కుట్రలు బట్టబయలయ్యేసరికి అబద ్ధపు ఫ్లెక్సీలు

సాక్షి, విశాఖపట్నం: తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన కుట్రలు సీబీఐ చార్జీషీట్‌తో విఫలమయ్యాయని, అందుకే దిక్కుతోచక వైఎస్సార్‌సీపీ నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారని జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మండిపడ్డారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో అక్కయ్యపాలెం కూడలిలో గుర్తుతెలియని వ్యక్తులు వై.ఎస్‌. జగన్‌మోహన్‌నెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌ రెడ్డిల ఫొటోలతో అబద్ధపు ఆరోపణలున్న భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని సీబీఐ తేల్చిచెప్పిన నేపధ్యంలో, ప్రజల దృష్టిని మళ్లించేందుకు కూటమి మద్దతుదారులు విశాఖలో శాంతిభద్రతల సమస్యను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై ఇలా తప్పుడు ప్రచారం చేయడం తీవ్రమైన నేరమన్నారు. ఈ ఘటనపై కేకే రాజు ఫోర్త్‌ టౌన్‌ సీఐ ఉమాకాంత్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తూ, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement