డీఎస్పీగా లోచన్‌కుమార్‌ ఎంపిక | - | Sakshi
Sakshi News home page

డీఎస్పీగా లోచన్‌కుమార్‌ ఎంపిక

Feb 1 2026 7:24 AM | Updated on Feb 1 2026 7:24 AM

డీఎస్పీగా లోచన్‌కుమార్‌ ఎంపిక

డీఎస్పీగా లోచన్‌కుమార్‌ ఎంపిక

అల్లిపురం: గ్రూప్‌–1 ఫలితాల్లో జీవీఎంసీ 34వ వార్డు భూపేష్‌నగర్‌ ప్రాంతానికి చెందిన చెల్లుబోయిన లోచన్‌కుమార్‌ సత్తా చాటాడు. డీఎస్పీగా ఎంపికయ్యాడు. అతని తండ్రి రవిశంకర్‌ శ్రీనివాస్‌ నేవల్‌ డాక్‌యార్డులో ఉద్యోగి కాగా తల్లి సత్యవతి గృహిణి. లోచన్‌కుమార్‌ ప్రాథమిక విద్యాభ్యాసం నగరంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో, ఇంటర్‌ గాయత్రి కాలేజీలో, డిగ్రీ ఆంధ్ర యూనివర్సిటీలో కొనసాగించాడు. 2024లో ఆర్‌ఎస్‌ఐగా సెలక్ట్‌ అయ్యాడు. జాబ్‌ చేస్తూనే గ్రూప్‌–1కి ప్రిపేర్‌ అయిన లోచన్‌కుమార్‌ గ్రూప్‌–1లో డీఎస్పీగా ఎంపికయ్యాడు. ఈ మేరకు అతని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. తన తల్లిదండ్రుల కోరిక మేరకు కష్టపడి చదివి డీఎస్పీగా ఎంపికయ్యాయనని లోచన్‌కుమార్‌ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement