రెండు బైకులు ఢీకొని యువకుడి మృతి
సబ్బవరం: మండలంలోని అనకాపల్లి–నారపాడు ప్రధాన రహదారిపై అమ్ములపాలెం చర్చి సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో షేక్ రెహ్మాన్ (27) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారపాడు శివారు బలిజపాలెంకు చెందిన రెహ్మాన్ సబ్బవరంలోని ఒక చికెన్ సెంటర్‌లో పనిచేస్తున్నాడు. పని నిమిత్తం సబ్బవరం వెళ్లి తిరిగి వస్తుండగా, ఎదురుగా వస్తున్న గోర్లి శ్రీనివాసరావు ద్విచక్రవాహనం రెహ్మాన్ బైకును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయమైన రెహ్మాన్ మరణించగా, శ్రీనివాసరావుకు స్వల్ప గాయాలయ్యాయి. సీఐ జి. రామచంద్రరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య షకీనా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


