‘గిరగిర గింగిరానివే... | - | Sakshi
Sakshi News home page

‘గిరగిర గింగిరానివే...

Jan 31 2026 5:58 AM | Updated on Jan 31 2026 5:58 AM

‘గిరగిర గింగిరానివే...

‘గిరగిర గింగిరానివే...

విశాఖ ఉత్సవ్‌లో హోరెత్తించిన

గాయకుడు రామ్‌ మిరియాల

ఏయూక్యాంపస్‌: విశాఖ ఉత్సవ్‌లో భాగంగా ఆర్కే బీచ్‌ వేదికగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రముఖ నేపథ్య గాయకుడు రామ్‌ మిరియాల తన గాత్రంతో హోరెత్తించారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ వేడుకలో రామ్‌ మిరియాల తనదైన శైలిలో గిరగిర గింగిరానివే, చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే వంటి హిట్‌ గీతాలను ఆలపిస్తూ యువతలో ఉత్సాహాన్ని నింపారు. వేణువుపై మధుర స్వరాలను పలికిస్తూనే, మరోవైపు బంగారు కోడిపెట్ట, డీజే టిల్లు, భీమ్లా నాయక్‌ చిత్రాలలోని మాస్‌ సాంగ్స్‌తో సభికులను ఉర్రూతలూగించారు. కేవలం ఆధునిక గీతాలే కాకుండా, పాత తరం రెట్రో పాటలను కూడా అలవోకగా పాడుతూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అంతకుముందు ప్రముఖ వెంట్రిలాక్విస్ట్‌ బొట్టా నాగేశ్వరరావు ప్రదర్శించిన కార్యక్రమం చిన్నారులను, పెద్దలను విశేషంగా అలరించింది. బొమ్మలతో ఆయన పలికించిన సంభాషణలు నవ్వులు పూయించాయి. సముద్ర తీరంలో సంగీత, కళా ప్రదర్శనల మేళవింపుతో విశాఖ ఉత్సవ్‌ వైభవంగా సాగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement