ఎఫ్‌ఏపీసీసీఐ ఎక్స్‌లెన్స్ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
బీచ్‌రోడ్డు: ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్‌ఏపీసీసీఐ) 2025–26 సంవత్సరానికి గాను రాష్ట్ర స్థాయి ఎక్స్‌లెన్స్ అవార్డుల కోసం నామినేషన్లను ఆహ్వానిస్తోంది. బుధవారం నగరంలోని ఓ హోటల్‌లో జరిగిన సమావేశంలో అవార్డుల కమిటీ చైర్మన్ కంకటాల మల్లికార్జునరావు ఈ వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తల ప్రతిభను, ఆవిష్కరణలను గుర్తించి ప్రోత్సహించడమే ఈ అవార్డుల లక్ష్యమని ఆయన తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య, భారీ తరహా పరిశ్రమలు, స్టార్టప్‌లు, మహిళా పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారులు, విద్యాసంస్థలు అవార్డుకు అర్హులని, వ్యవసాయం, ఆక్వా, ఎగుమతులు, ఉత్తమ మహిళా వ్యాపారవేత్త, సీఎస్‌ఆర్, గ్రీన్ ఎనర్జీ, గ్రామీణ వ్యాపారం, ఉద్యోగుల సంక్షేమం తదితర విభాగాల్లో అవార్డులు అందజేస్తామన్నారు. ఆసక్తి గలవారు www.fapcci.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకుని, పూర్తి చేసి 2026 ఫిబ్రవరి 25 లోపు సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాలకు 93914 22821కు సంప్రదించాలని, అందిన దరఖాస్తులను రిటైర్డ్ జడ్జిలతో కూడిన స్వతంత్ర జ్యూరీ పరిశీలించి విజేతలను ఎంపిక చేస్తుందన్నారు. సమావేశంలో ఎఫ్‌ఏపీసీసీఐ అధ్యక్షుడు ఎ.సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు కిశోర్ కుమార్, వ్యవస్థాపక అధ్యక్షుడు సి.వి.అచ్యుతరావు, అవార్డుల కమిటీ సహాధ్యక్షుడు సి.వి. ప్రద్యుమ్న పాల్గొన్నారు.


