నగర ప్రగతే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

నగర ప్రగతే లక్ష్యం

Jan 27 2026 9:43 AM | Updated on Jan 28 2026 8:37 AM

నగర ప్రగతే లక్ష్యం

నగర ప్రగతే లక్ష్యం

జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌

డాబాగార్డెన్స్‌: నగర ప్రగతే లక్ష్యంగా జీవీఎంసీ అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా పనిచేస్తున్నారని కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ పేర్కొన్నారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్‌ పీలా శ్రీనివాసరావుతో కలిసి ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన 192 మంది అధికారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు ఈ సందర్భంగా ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు భీశెట్టి వసంతలక్ష్మి, కందుల నాగరాజు, మాదంశెట్టి చిన్నతల్లి, మహ్మద్‌ సాధిక్‌, బిపిన్‌కుమార్‌ జైన్‌, జీవీఎంసీ అదనపు కమిషనర్లు సత్యవేణి, ఎస్‌ఎస్‌ వర్మ, డీవీ రమణమూర్తి, పి.నల్లనయ్య, ప్రధాన ఇంజినీరు పీవీ సత్యనారాయణరాజు, అన్ని విభాగాల ఉన్నతాధికారులు, జోనల్‌ కమిషనర్లు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, నివాసిత సంక్షేమ సంఘాలు, పలు బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement