రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం
సాక్షి, విశాఖపట్నం: ప్రస్తుతం రాష్ట్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం కాకుండా.. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. సోమవారం మద్దిలపాలెంలో గల పార్టీ కార్యాలయంలో జిల్లా వాలంటీర్ విభాగం అధ్యక్షుడు పీలా ప్రేమ్‌కిరణ్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅఽతిథిగా హాజరైన కేకే రాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో సాగుతున్న రాచరిక పాలనకు వ్యతిరేకంగా మనమంతా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అంబేడ్కర్ రాజ్యాంగానికి లోబడి ప్రజాపాలన అందించారని గుర్తుచేశారు. వెనుకబడిన కులాల కోసం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు దేశ చరిత్రలోనే ఎవరూ తీసుకోలేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుంబా రవిబాబు, సమన్వయకర్తలు తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావు, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, సీఈసీ సభ్యులు కోలా గురువులు, ఎస్‌ఈసీ సభ్యులు రొంగలి జగన్నాథం, జహీర్ అహ్మద్, సతీష్ వర్మ, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, రాష్ట పార్టీ సంయుక్త కార్యదర్శులు పీవీ నారాయణ, కిరణ్ రాజు, తాడి జగ్గన్నాథరెడ్డి, నాగ మల్లేశ్వరి, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షుడు పేర్ల విజయ్ చంద్ర, రాష్ట్ర అనుబంధ విభాగాల కార్యనిర్వాహక అధ్యక్షులు జి.వి.రవిరాజు, ద్రోణంరాజు శ్రీ వత్సవ, రాష్ట్ర, జోనల్, జిల్లా అనుబంధ అధ్యక్షులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.


