సోషల్ మీడియాలో అప్పన్న మూలవిరాట్ వీడియో హల్‌చల్
సింహాచలం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి మూలవిరాట్ వీడియో ఆదివారం సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఆలయ నీలాద్రిగుమ్మం వద్ద నుంచి స్వామివారి మూలవిరాట్‌ని చిత్రీకరించిన వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టింది. ఆలయంలోకి మొబైల్‌లు అనుమతి లేదు. అయినా మూలవిరాట్ చిత్రీకరణ చోటుచేసుకోవడం పట్ల భక్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. భద్రతా సిబ్బంది, ఉద్యోగుల నిఘా లేకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నీలాద్రిగుమ్మం వద్ద నుంచి కనిపిస్తున్న అప్పన్న మూలవిరాట్


