వైజ్ఞానిక ప్రదర్శనకు ‘గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టు’ | - | Sakshi
Sakshi News home page

వైజ్ఞానిక ప్రదర్శనకు ‘గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టు’

Dec 29 2025 9:18 AM | Updated on Dec 29 2025 9:18 AM

వైజ్ఞానిక ప్రదర్శనకు ‘గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టు’

వైజ్ఞానిక ప్రదర్శనకు ‘గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టు’

సీతంపేట: మధురానగర్‌ జీవీఎంసీ ఉన్నత పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. ఈ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న జి.విష్ణువర్ధన్‌ కుమార్‌, పి.రామచరణ్‌ రూపొందించిన ‘పొల్యూషన్‌ ఫ్రీ నేచర్‌ ఫర్‌ ఫ్యూచర్‌’ ప్రాజెక్టు జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికై ంది. గైడ్‌ టీచర్‌ వి.వి. అశోకవాణి పర్యవేక్షణలో విద్యార్థులు సిద్ధం చేసిన ఈ నమూనా, పర్యావరణ పరిరక్షణకు గ్రీన్‌ ఎనర్జీ ప్రాముఖ్యతను వివరిస్తూ అందరినీ ఆకట్టుకుంది. ఈ గొప్ప విజయం సాధించిన విద్యార్థులను, మార్గదర్శకత్వం వహించిన టీచర్‌ను జిల్లా విద్యాశాఖాధికారి ప్రేమకుమార్‌, ఉప విద్యాశాఖాధికారి సోమేశ్వరరావు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి.లక్ష్మీనరస, పీడీ సునంద్‌ , ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement