విగతజీవులుగా సముద్ర జీవరాశులు
కొమ్మాది: భీమిలి బీచ్ రోడ్డు మంగమారిపేట తీరంలో ఆదివారం విషాదకర దృశ్యం చోటుచేసుకుంది. భారీ సంఖ్యలో సముద్ర జీవరాశులు విగతజీవులుగా మారి అలల తాకిడికి తీరానికి కొట్టుకువచ్చాయి. వీటిలో ప్రధానంగా కటిల్‌ఫిష్‌లతో పాటు తాబేళ్లు, ముళ్లకప్ప చేపల కళేబరాలు బీచ్ అంతటా పడి ఉండటం స్థానికులను కలచివేసింది. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులు, సముద్ర జలాల్లో పెరుగుతున్న కాలుష్యం, మత్స్యకారుల బోట్లు బలంగా తగిలినప్పుడు ఇలాంటి మరణాలు సంభవిస్తాయని తీరప్రాంత మత్స్యకారులు అభిప్రాయపడుతున్నారు.
కటిల్ ఫిష్, ముళ్లకప్ప చేప
విగతజీవులుగా సముద్ర జీవరాశులు


