ఫరెవర్ మిస్ ఇండియాగా నిహారిక
బీచ్‌రోడ్డు: రాజస్థాన్ జైపూర్‌లో ఇటీవల నిర్వహించిన ఫరెవర్ స్టార్ ఇండియా అవార్డ్స్ వేడుకలో నగరానికి చెందిన నిహారిక బేతనపల్లి ఫరెవర్ మిస్ ఇండియా కిరీటం కై వసం చేసుకున్నారు. విశాఖకు చేరుకున్న ఆమె ఆదివారం నగరంలోని ఒక హోటల్‌లో మీడియాతో మాట్లాడారు. ఫరెవర్ స్టార్ ఇండియా దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతూ.. ప్రతి ఒక్కరూ ఈ పోటీల్లో పాల్గొని రాణించేందుకు ప్రోత్సాహం అందిస్తోందన్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ అందాల పోటీలో సుమారు 10,000 నామినేషన్లు రాగా.. 105 మంది ఫినాలేకు ఎంపికయ్యారని తెలిపారు. తొలుత మిస్ బెంగళూరు కిరీటం గెలుచుకుని, ఇప్పుడు జాతీయ స్థాయిలో మిస్ ఇండియా కిరీటం పొందటం ఒక కీలక మైలురాయిని ఆమె పేర్కొన్నారు.


