బార్లు, పబ్‌లు నిబంధనలు పాటించాల్సిందే..
విశాఖ సిటీ : నగరంలో బార్లు, పబ్‌లు నిబంధనలు పాటించాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి నిర్వాహకులను ఆదేశించారు. బుధవారం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో డీసీపీ–1 మణికంఠ చందోలు, ఎకై ్సజ్ శాఖ ఉన్నతాధికారులతో కలిసి బార్లు, పబ్‌ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బార్లు, పబ్‌లు నిర్ణీత సమయం వరకే నడపాలని ఆదేశించారు. ఎకై ్సజ్ శాఖ నుంచి అనుమతి లేకుండా, గడువు ముగిసిన లైసెన్స్‌లతో నడపకూడదని, ధ్వని కాలుష్య నియమాలను ఉల్లంఘించరాదని, ముఖ్యంగా రాత్రి సమయాల్లో అనుమతించిన డెసిబెల్ పరిమితులకు మించి శబ్దంతో సంగీతాన్ని ప్లే చేయకూడన్నారు. బార్లు, పబ్‌లు సామర్థ్యం మేరకు కస్టమర్లను అనుమతించాలని, సరైన అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచాలని, భద్రతా ప్రోటోకాల్స్‌ను తప్పనిసరిగా పాటించాలన్నారు. వయస్సు ధృవీకరణ పత్రాలను సరిగ్గా తనిఖీ చేయాలని, మైనర్లకు మద్యం సరఫరా చేయకూడదని అసభ్యకరమైన సైగలు, అసభ్య ప్రదర్శనలు, అనుచిత ప్రవర్తనతో కూడిన డీజే పార్టీలు, డ్యాన్స్ కార్యక్రమాలు నిర్వహించకూడదన్నారు. సిబ్బంది, బౌన్సర్లు, ఇతర ఉద్యోగులను సరైన పోలీసు వెరిఫికేషన్ లేకుండా నియమించుకోకూడదని తెలిపారు. పబ్ ప్రాంగణంలో మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాల వినియోగం, పంపిణీని ఎట్టి పరిస్థితుల్లోను ఉపేక్షించేది లేదన్నారు. కస్టమర్లు వాహనాలను అడ్డదిడ్డంగా పార్క్ చేయకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి పబ్, వైన్‌షాప్ బయట స్థానిక పోలీస్ స్టేషన్ నెంబర్‌తో పాటు సీపీ ఫోన్ నెంబర్ 7995095799 స్పష్టంగా ప్రదర్శించాలని తెలిపారు.


