జాతీయ సైన్స్ ప్రదర్శనకు రెండు ప్రాజెక్టులు
ఆరిలోవ: జిల్లా నుంచి జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్‌కు రెండు ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. వాటిలో ఒకటి సదరన్ సైన్స్ ఫెయిర్‌కు కూడా ఎంపిక కావడం విశేషం. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల, జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన పోటీలు ఇటీవల నిర్వహించారు. బుధవారం జరిగిన రాష్ట్ర స్థాయి ప్రదర్శనలో కూడా ఉత్తమంగా నిలిచాయి. విజయవాడలో బుధవారంతో ముగిసిన రెండు రోజుల ప్రదర్శనలో విశాఖ జిల్లా శ్రీకృష్ణాపురంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులం నుంచి గైడ్ ఉపాధ్యాయుడు(ఫిజికల్ సైన్స్) బి.సీతారాం ఆధ్వర్యంలో 9వ తరగతి విద్యార్థులు బి.మహేష్, కె.యోగి తయారు చేసిన ‘హైడ్–ఫ్రైడ్ వాటర్ టాప్స్’ప్రాజెక్టు జనవరి 19 నుంచి 23 వరకు జరగనున్న సదరన్ వైజ్ఞానిక ప్రదర్శనకు, ఆ తర్వాత జరగనున్న జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికై ందని డీఈవో ఎన్.ప్రేమకుమార్ తెలిపారు. దీంతో పాటు నగరంలోని మధురానగర్ హైస్కూల్‌లో గైడ్ టీచర్ వి.వి.అశోకవాణి ఆధ్వర్యంలో విద్యార్థులు విష్ణువర్ధన్, పి.రామ్‌చరణ్ తయారు చేసిన ‘పొల్యూషన్ ఫ్రీ నేచర్ ఫర్ ఫ్యూచర్’ప్రాజెక్టు జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికై ందన్నారు. ఆయా ప్రాజెక్టులు తయారుచేసిన విద్యార్థులు, గైడ్ టీచర్లను డీఈవోతోపాటు, జిల్లా సైన్స్ అధికారి పి.రాజారావు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందించారు.
జాతీయ సైన్స్ ప్రదర్శనకు రెండు ప్రాజెక్టులు


