ఉత్సాహంగా పీసా రన్‌ | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా పీసా రన్‌

Dec 24 2025 3:49 AM | Updated on Dec 24 2025 3:49 AM

ఉత్సాహంగా పీసా రన్‌

ఉత్సాహంగా పీసా రన్‌

ఏయూక్యాంపస్‌ : పీసా మహోత్సవ్‌లో భాగంగా మంగళవారం ఉదయం బీచ్‌రోడ్డులో 10 కిలోమీటర్ల పరుగు పోటీ నిర్వహించారు. ఆర్‌కే బీచ్‌ కాళీమాత ఆలయం నుంచి తెన్నేటి పార్క్‌ వరకు.. అక్కడ నుంచి కాళీమాత ఆలయం వరకు ఈ పరుగు పోటీ ఉత్సాహంగా సాగింది. కార్యక్రమాన్ని ఆర్చరీ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత జ్యోతి సురేఖ జెండా ఊపి ప్రారంభించారు. పలు రాష్ట్రాలకు చెందిన క్రీడా కారులు, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పంచాయతీరాజ్‌ జాయింట్‌ సెక్రటరీ ముక్త శేఖర్‌, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కృష్ణతేజ, ఏపీఎస్‌ఐఆర్‌డీ కమిషనర్‌ ముత్యాలరాజు తదితరులు పాల్గొన్నారు.

విజేతలు ఇలా..

పురుషుల్లో మహారాష్ట్రకు చెందిన అతుల్‌ చిత్తోడ్‌ (34:54.15), సూరజ్‌ మాషి (34:54.86), మనోజ్‌ హిలిన్‌ (35:00.56) మొదటి మూడు స్థానాలలో నిలిచారు. మహిళల విభాగంలో రాజస్థాన్‌కు చెందిన రాజకుమార్‌ (43:15.14), జార్ఖండ్‌కు చెందిన హీరా సంఘ (45:18.14), హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ప్రియా (45:18.14) మొదటి మూడు స్థానాలలో నిలిచారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో నారాయణమూర్తి, డీఎస్‌వో జూన్‌ గ్యాలయిట్‌, పంచాయతీరాజ్‌ అధికారులు, వైజాగ్‌ వలంటీర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement