జూలో నెమళ్ల ఎన్‌క్లోజర్ ప్రారంభం
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కులో నూతనంగా ఏర్పాటు చేసిన నెమళ్ల ఎన్‌క్లోజర్‌ను ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పీవీ చలపతిరావు మంగళవారం ప్రారంభించారు. ఆలివ్ రిడ్లే తాబేళ్లపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో పాల్గొన్న ఆయన, అడిషనల్ పీసీసీఎఫ్ డాక్టర్ శాంతిప్రియ పాండే, సీఎఫ్ మైధీన్‌లతో కలిసి ఈ ఎన్‌క్లోజర్‌ను సందర్శించి నెమళ్లను లోపలికి విడిచారు. ప్రస్తుతం ఈ ఎన్‌క్లోజర్‌లో పిల్లలతో కలిపి మొత్తం 40 నెమళ్లను ఉంచినట్లు జూ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా చలపతిరావు మాట్లాడుతూ జూలోని వన్యప్రాణుల సంరక్షణ విషయంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉంటూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం జూ క్యూరేటర్ జి. మంగమ్మ మాట్లాడుతూ.. జంతు దత్తత కార్యక్రమంలో భాగంగా ఇషాన్వి, మనస్వి అనే వ్యక్తులు ఇక్కడి 15 నెమళ్లను దత్తత తీసుకున్నట్లు వెల్లడించారు.


