అవగాహనతోనే మోసాలకు అడ్డుకట్ట
మహారాణిపేట: వినియోగదారులు హక్కులను ఆయుధాలుగా మలుచుకొని మోసాలకు అడ్డుకట్ట వేయాలని జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ పిలుపునిచ్చారు. జాతీయ వినియోగదారుల హక్కుల వారోత్సవాల్లో భాగంగా కన్స్యూమర్ ఆర్గనైజేషన్స్ ఫెడరేషన్స్ రూపొందించిన ‘మేలుకో.. హక్కులు తెలుసుకో’ అందరి చుట్టం వినియోగదారుల రక్షణ చట్టం’ బ్రోచర్‌ను సోమవారం ఆయన ఆవిష్కరించారు. చైతన్యవంతమైన వినియోగదారులే ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వి.భాస్కరరావు, కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ మై భారత్(నెహ్రౌ యువ కేంద్రం) డిప్యూటీ డైరెక్టర్ జి.మహేశ్వరావు, కన్స్యూమర్ ఆర్గనైజేషన్స్ ఫెడరేషన్స్ రాష్ట్ర అధ్యక్షుడు కాండ్రేగుల వెంకటరమణ, కన్స్యూమర్ రైట్స్ సేఫ్ గార్డింగ్ సొసైటీ అధ్యక్షుడు రెడ్డి సత్యనారాయణ, జిల్లా రెవెన్యూ అధికారి కె.సత్తిబాబు, యూసీడీ పీడీ సత్యవేణి, ఎన్‌ఎస్‌ఎస్ జాతీయ అవార్డు గ్రహీత రామపాత్రుడు తదితరులు పాల్గొన్నారు.


