అణగదొక్కాలని చూస్తే రెట్టింపు స్పీడ్‌తో ఎదుగుతాం..
చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్ సీపీ కార్యక్రమాలను, పార్టీని అణగదొక్కాలని అనుకుంటే.. గొడకు కొట్టిన బంతిలా అంతకు రెట్టింపు స్పీడ్‌తో ఎదుగుతామని వైఎస్సార్ సీపీ విశాఖ, అనకాపల్లి జిల్లాల అధ్యక్షులు కేకే రాజు, గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలు ఎదురు తిరిగారని, రానున్న కాలంలో ఆ పార్టీలను బంగాళాఖాతంలో కలపడం ఖాయమని హెచ్చరించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి, తమ పార్టీ అధినేత జన్మదిన వేడుకలకు ప్రజల నుంచి వచ్చిన ఆదరణను చూసి ఓర్వలేక చంద్రబాబు ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుందంటూ మండిపడ్డారు. వీఎంఆర్‌డీఏ అధికారులు, పోలీసులు టీడీపీ కార్యకర్తలా కాకుండా నిబంధనల లోబడి పనిచేయాలని హితవు పలికారు.


