మా పిల్లలను ఆదుకోవాలి
కండరాల బలహీనత వ్యాధితో బాధపడుతున్న తమ పిల్లలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని పలువురు తల్లిదండ్రులు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్‌కు విన్నవించారు. విశాఖలో సుమారు 33 మంది పిల్లలు ఈ జబ్బు కారణంగా ఎదుగుదల లేక, కనీసం భోజనం కూడా చేయలేని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టినప్పటి నుంచి ఏ పనీ చేసుకోలేక మంచానికే పరిమితమైన తమ బిడ్డలకు అవసరమైన వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని కోరారు. చదువుకు దూరమై, రక్త పరీక్షలు చేయించుకోవడం కూడా భారంగా మారిన తమ పిల్లల దీనస్థితిని గమనించి, ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని వినతి పత్రం సమర్పించారు.


