పీజీఆర్‌ఎస్‌కు 120 ఫిర్యాదులు
విశాఖ సిటీ: ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)కు వచ్చిన ఫిర్యాదులపై దృష్టి పెట్టి చట్ట ప్రకారం సత్వరమే పరిష్కరించాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం పోలీస్ సమావేశ మందిరంలో జరిగిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి 120 ఫిర్యాదు వచ్చాయి. సీపీ స్వయంగా ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి వాటిని త్వరితగతిన పరిష్కరించాలని చెప్పారు.


