పింఛన్ నిలిచిపోవడంతో వీధిన పడ్డాం
గత జగనన్న ప్రభుత్వ హయాంలో నెలకు రూ.3 వేలు పింఛన్ వచ్చేదని, చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిని నిలిపివేయడం వల్ల తమ కుటుంబం వీధిన పడిందని మద్దిలపాలెం మంగాపురం కాలనీకి చెందిన ఆత్మకూరు జయలక్ష్మి, కుమారుడు నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త శ్రీనివాస్ పక్షవాతంతో మంచం పట్టాడని, కుమారుడు ట్రై సైకిల్‌పై ఆధారపడి జీవిస్తున్నాడని పేర్కొన్నారు. పింఛన్ ఎందుకు ఇవ్వడం లేదో అధికారులు సమాధానం చెప్పడం లేదన్నారు. తక్షణమే పింఛన్ పునరుద్ధరించి, తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని నాగరాజు విజ్ఞప్తి చేశాడు.


