● స్నోయగాల నగరి
నీలి సముద్రపు అంచులపై తెల్లని మంచు తెరలు పరచుకుని, సాగర కన్య ముసుగు వేసుకున్నట్లుగా విశాఖ తీరం ఒక అందమైన కావ్యంలా మెరిసిపోతోంది. సాగరనగరిని ముంచెత్తుతున్న పొగమంచు సోయగాలు ఒకవైపు ప్రకృతి ప్రేమికులకు కేరింతలు పుట్టిస్తుంటే, మరోవైపు జిల్లా వ్యాప్తంగా విసురుతున్న చలి పంజా సామాన్యులను వణికిస్తోంది. ఎముకలు కొరికే గాలి, వెన్నులో వణుకు పుట్టించే చల్లదనం వెచ్చని దుప్పటిని వీడనీయడం లేదు. బారెడు పొద్దెక్కినా మంచు వీడక, బయటకు అడుగు పెట్టాలంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు.
– ఫొటో : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం


