కాలుష్య నివారణకు చర్యలు
కలెక్టర్ హరేందిర ప్రసాద్
మహారాణిపేట: నగరంలో కాలుష్య నివారణకు పటిష్ట చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ తెలిపారు. అమరావతిలోని సచివాలయం ఐదో బ్లాక్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఐదో కలెక్టర్ల సదస్సులో ఆయన పాల్గొన్నారు. విశాఖలో కాలుష్య స్థాయిలు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయని రాష్ట్ర ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ కాలుష్య నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. పర్యావరణ విధానాలు, చట్టాలు, నిబంధనలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. కాలుష్య కారకాలను గుర్తించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.


