విశాఖ చేరుకున్న మహిళా క్రికెటర్లు
భారత్, శ్రీలంక మహిళా క్రికెట్ జట్లు బుధవారం విశాఖ చేరుకున్నాయి.
ఈ నెల 21, 23 తేదీల్లో ఇక్కడ జరగనున్న టీ–20 మ్యాచ్‌ల్లో తలపడేందుకు ఇరు జట్ల క్రీడాకారిణులు నగరానికి విచ్చేశారు. వీరికి విశాఖ విమానాశ్రయంలో ఆంధ్ర క్రికెట్
అసోసియేషన్ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. ఈ మ్యాచ్‌లు పీఎంపాలెంలోని
డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో
జరగనున్నాయి. విమానాశ్రయం నుంచి ఆటగాళ్లు రోడ్డు మార్గంలో ప్రత్యేక బస్సుల్లో తమకు కేటాయించిన హోటళ్లకు చేరుకున్నారు. – గోపాలపట్నం
విశాఖ చేరుకున్న మహిళా క్రికెటర్లు


